
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి
ఆత్మకూరు(ఎం): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జెడ్పీ సీఈఓ శోభారాణి అధికారులకు సూచించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయాన్ని ఆమె తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమం ఏర్పాటు చేశారు. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికలు నిర్వహించేలా సామగ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇళ్ల పనులు త్వరితగతిన పూర్తయ్యేలా లబ్ధిదారులకు సహకరించాలని కోరారు. ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారులు ఉంటే గుర్తించి కారణాలు తెలుసుకోవాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులున్న వారికి మహిళా సంఘాల నుంచి రుణాలు ఇప్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రాములునాయక్, ఎంపీఓ పద్మావతి, సూపరింటెండెంట్ ఎలిమినేటి లోకేశ్వర్‌రెడ్డి, ఏపీఓ రమేష్ పాల్గొన్నారు.