
ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలి
యాదగిరిగుట్ట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జాప్యం చేయొద్దని, ఎప్పటికప్పుడు అధికారులు ఇళ్ల నిర్మాణ పనులు పర్యవేక్షించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని యాదగిరిపల్లిలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన తనిఖీ చేశారు. మున్సిపాలిటీలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇళ్ల వచ్చాయని మున్సిపల్ కమిషనర్ లింగస్వామిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎన్ని ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి.. ఇంకా ప్రారంభించనివి ఎన్ని, ప్రారంభించకపోవడానికి కారణాలు ఏమిటని అడిగారు. యాదగిరిపల్లిలో స్లాబ్ దశలో పనులు జరుగుతున్న గుంటిపల్లి రేణుక ఇంటిని పరిశీలించారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు మేసీ్త్రలకు స్క్వేర్ ఫీట్‌కు రూ.300 కంటే ఎక్కువ ఇవ్వొద్దన్నారు. ఇటుక, సిమెంట్, స్టీల్ ఎక్కడ నుంచి ఎంత ధరకు తెచ్చుకుంటున్నారని ఆరా తీశారు. ప్రభుత్వమే ఇసుక ఉచితంగా ఇస్తుందని కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, మున్సిపల్ అధికారులున్నారు.
మహిళా సమాఖ్య భవనం పరిశీలన
భువనగిరి టౌన్: కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మాణ దశలో ఉన్న జిల్లా మహిళా సమాఖ్య భవనం పనులను కలెక్టర్ హనుమంతురావు మంగళవారం పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అక్టోబర్ వరకు పనులు పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
రాజాపేట : ీసజనల్ వ్యాధులపై అప్రమత్తంగా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం రాజాపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఓపీ, సాధారణ డెలివరీల వివరాలు, రోగులకు అవసమైయ్యే మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించే విధంగా చూడాలని ఎంపీడీఓ నాగవేణికి సూచించారు. కలెక్టర్ వెంట డాక్టర్ ప్రవీన్‌కుమార్, ఆయూష్ డిస్పెన్సరీ డాక్టర్ చందన, సిబ్బంది తదితరులున్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు