
కొత్త డిజైన్ అవార్డు తెచ్చింది
సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన కొలను శంకర్ లెనిన్ డబుల్ ఇక్కత్ చీర తయారుచేశారు. లెనిన్ డబుల్ ఇక్కత్ చీర నేయడం దేశంలో ఇదే మొదటిసారి. ఈ చీర 15 షేడులు, సున్నితమైన దారాలతో రంగు వెలిసిపోని చీర. ఈ చీర డిజైన్ కోసం సంవత్సరం కాలం పట్టిందని శంకర్ తెలిపారు. చీర తయారీకి రూ.50వేలు ఖర్చు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తన 30సంవత్సరాల అనుభవంలో ఎన్నో రకాల చీరలు తయారు చేశానని, కానీ అవార్డు కోసం ఎప్పుడూ దరఖాస్తు చేసుకోలేదన్నారు. ఈ చీరకు దరఖాస్తు చేసుకోవడంతో కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు వచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.