
చిన్నతనం నుంచే జీతమున్నా..
చండూరు: చండూరు మండల కొండాపురం గ్రామానికి చెందిన అవ్వారి రవీందర్ తయారు చేసిన ఇక్కత్ రాజ్‌కోట్ చీరకు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డు దక్కింది. ఇవి వేరే దేశాలతో పాటు రాజస్తాన్, అహ్మదాబాద్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను 10 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే మగ్గం పనిచేసే వారి వద్ద జీతం ఉన్నానని, ఆ తర్వాత బొంబాయికి వలస వెళ్లి అక్కడ పదేళ్లు ఉండి సాంచన్‌లు నడిపి తిరిగి కొండాపురం గ్రామం వచ్చినట్లు రవీందర్ తెలిపారు. కొత్తగా వచ్చే డిజైన్లను గమనించి చీరలు తయారు చేయడం తనకు అలవాటని ఆయన పేర్కొన్నారు. 20 ఏళ్ల కిందటే 5 మగ్గాలతో చీరలు నేయించినట్లు వివరించారు. ప్రసుత్తం తనకు 69 ఏళ్లని, ఇన్నేళ్లకు తనకు గుర్తింపు లభించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.