
న్యూ మ్యాట్రిక్ టిల్ శారీ ఎంతో స్పెషల్
చండూరు: న్యూ మ్యాట్రిక్ టిల్ ఇక్కత్ విధానంలో చీర నేసి చండూరు మండల కేంద్రానికి చెందిన కర్నాటి సద్గురు కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపికయ్యారు. ఈ స్పెషల్ ఇక్కత్ చీర నేసేందుకు ఐదు నెలల సమయం పట్టిందని ఆయన పేర్కొన్నారు. డిజైన్ ఫైనల్ చేయడం, మగ్గంపై డిజైన్ నూలుపై సెట్ చేయడానికే రెండు నెలల సమయం పట్టిందన్నారు. 25 ఏళ్లుగా మగ్గం నేస్తున్నానని, తనకున్న అనుభవంతో కొత్త డిజైన్లతో చీరలు రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ చీర ధర రూ.25వేల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ తరహా చీర నల్లగొండ జిల్లాలో తానొక్కడినే చేశానని, అంత ప్రత్యేకం కాబట్టే అవార్డుకు ఎంపికై ందని ఆయన తెలిపారు. సబ్సిడీ ముడి సరుకుల డిపో నల్లగొండ లేదా చౌటుప్పల్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

న్యూ మ్యాట్రిక్ టిల్ శారీ ఎంతో స్పెషల్