
108 డిజైన్లు.. 29 రంగులు
గట్టుప్పల్: ఎంతో శ్రమించి 108 డిజైన్లు, 29 రంగులతో చీరను తయారుచేశారు గట్టుప్పల్‌కు చెందిన కర్నాటి కృష్ణయ్య. ఆయన గత 40 ఏళ్లుగా చేనేత మగ్గంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. చేనేతలో కొత్తదనం సృష్టించాలనే తపనతో కృష్ణయ్య ఏడాది క్రితం 108 డిజైన్లు, 29 రంగులతో చీర తయారు చేయడం ప్రారంభించారు. నెలరోజుల క్రితం ఈ చీర తయారీ పూర్తయ్యింది. క్వాలిటీ, కలర్స్, డిజైన్స్‌ను పరిశీలించిన చేనేత శాఖ అధికారులు కృష్ణయ్యను కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డుకు ఎంపిక చేశారు. ఇన్నేళ్ల తన కష్టానికి సరైన గుర్తింపు దక్కడంతో కృష్ణయ్య ఆనందం వ్యక్తం చేస్తున్నారు.