
మూసీ ప్రాజెక్టుకు 1250 క్యూసెక్కుల వరద
కేతేపల్లి: హైదరాబాద్ నగరంతో పాటు ఎగురవన మూసీ పరీవాహక ప్రాంతాల్లో కురుసున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు సోమవారం వదర పెరిగింది. ఆదివారం సాయంత్రం 240 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో సోమవారం ఉదయానికి 1250 క్యూసెక్కులకు పెరిగింది. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీటిమట్టం 642.90 అడుగులు ఉంది. ఆయకట్టులో వానాకాలం పంటల సాగు కోసం కుడి కాల్వకు 362 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 285 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. లీకేజీ, సీపేజీ, ఆవిరి రూపంలో 60 క్యూసెక్కుల నీరు వృథా అవుతుంది. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.91 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.