8న స్పాట్‌ అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

8న స్పాట్‌ అడ్మిషన్లు

Aug 5 2025 6:06 AM | Updated on Aug 5 2025 6:06 AM

8న స్

8న స్పాట్‌ అడ్మిషన్లు

రామగిరి(నల్లగొండ) : నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈనెల 8వ తేదీన స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపా ల్‌ సీహెచ్‌.నరసింహరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి డిప్లొమా ఇన్‌ సివిల్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ తదితర కోర్సుల్లో చేరడానికి స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష రాసి సీటు రాని విద్యార్థులతో పాటు పదో తరగతి పాస్‌ అయిన విద్యార్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు హాజరు కావాల్సిందిగా సూచించారు. 5నుంచి 7వ తేదీ వరకు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తామని, సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్స్‌లను జతపరచాలని కోరారు.

వంద శాతం ఫలితాలు సాధించాలి

తుర్కపల్లి,బీబీనగర్‌ : ఇంటర్‌లో వంద శాతం ఫలితాల సాధనకు కృషి చేయాలని వయోజన విద్య డైరెక్టర్‌ ఉషారాణి సూచించారు. తుర్కపల్లి మండలంలోని రాంపూర్‌తండా మోడల్‌ స్కూల్‌, బీబీనగర్‌ మండలం కొండమడుగు గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సోమవారం ఆమె సందర్శించారు. ఉపాధ్యాయులతో సమావేశం అయ్యారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం రూపొందించిన కార్యాచరణపై అడిగి తెలుసుకున్నారు. పీఎం శ్రీ నిధులతో కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులు చదువుపై పట్టు సాధించేలా మారుతున్న కాలానుగుణంగా బోధనలో మార్పులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారి పెసరు లింగారెడ్డి, ఎంఈఓలు మాలతి, సురేష్‌ రెడ్డి, ప్రధానోపాధ్యాయురాళ్లు వినోదాదేవి, ఉమాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

అడ్మిషన్లు పెంచితేనే

పాఠశాల మనుగడ

యాదగిరిగుట్ట రూరల్‌: మండలంలోని మైలార్‌గూడెం ప్రాథమిక పాఠశాలను సోమవారం డీఈఓ సత్యనారాయణ సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో గ్రామపెద్దలతో చర్చలు జరిపారు. విద్యార్థులు లేకపోవడంతో పాఠశాల మూసివేయాల్సిన పరిస్థితులో ఉందన్నారు. తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపి అడ్మిషన్‌లు పెంచితేనే పాఠశాలకు మనుగడ ఉంటుందని వారికి సూచించారు. అడ్మిషన్లు పెంచడానికి ఉపాధ్యాయులు కూడా కృషి చేయాలని కోరారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంఈఓ శరత్‌యామిని, కాంప్లెక్స్‌ జీహెచ్‌ఎం మల్లికార్జున్‌ తదితరులు ఉన్నారు.

పెండింగ్‌ సమస్యలపై పోరుబాట

భువనగిరి: జిల్లాలోని పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం సీపీఎం ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ తెలిపారు. సోమవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య, వైద్యం, ఉపాధి, భూ పంపిణీ వంటి సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారం కావడం లేదన్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌ 2022 సంవత్సరం నాటికే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉండగా నేటికీ పనులు పూర్తికాలేదన్నారు. గ్రామాల్లోనూ ప్రజా పాలన లేక అభివృద్ధి కుంటుపడిందన్నారు. ఈ నెల 20వరకు సమస్యల పరిశీలన, సంతకాల సేకరణ, గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట ధర్నాలు, 30వ తేదీన తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయనున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్‌లో పెండింగ్‌ ప్రాజెక్టులపై పోరుబాట ఉంటుందన్నారు. సమావేశంలో నాయకులు కొండమడుగు నర్సింహ, కల్లూరి మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయ కృష్ణ, గడ్డం వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

8న స్పాట్‌ అడ్మిషన్లు1
1/2

8న స్పాట్‌ అడ్మిషన్లు

8న స్పాట్‌ అడ్మిషన్లు2
2/2

8న స్పాట్‌ అడ్మిషన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement