
త్వరలోనే కళాశాలను తరలిస్తాం
ఆలేరు: ‘ప్రమాదమని తెలుసు..ఎందుకో అలుసు’ శీర్షికతో సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై కలెక్టర్ హనుమంతరావు స్పందించారు. కళాశాల పరిస్థితిపై ఇంటర్మీడియట్ జిల్లా విద్యాశాఖ అధికారి(డీఐఈఓ) రమణిని వివరణ కోరారు. కళాశాల భవనం శిథిలావస్థకు చేరిందని, తరగతుల నిర్వహణకు ఉపయోగించరాదని ఆర్‌అండ్‌బీ అధికారులు నివేదిక ఇచ్చిన విషయాన్ని కలెక్టర్‌కు ఆమె వివరించారు. వెంటనే కళాశాలను సందర్శించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు డీఐఈఓ కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపాల్ పూజారి వెంకటేశ్వర్లు, అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశమయ్యారు. భవనం గోడలు, తరగతి గదులు శిథిలమై, పగుళ్లు, లీకేజీలతో ప్రమాదకరంగా ఉన్నాయని వారు డీఐఈఓ దృష్టికి తెచ్చారు. ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోకి జూనియర్ కాలేజీని తరలించేందుకు డిగ్రీ కళాశాలల రాష్ట్ర కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపామని, రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు వస్తాయన్నారు. నూతన భవన నిర్మాణానికి రూ.53 కోట్ల నిధులు మంజూరయ్యాయని, కళాశాలను తరలించిన తరువాత పాత భవనాన్ని కూల్చివేసి నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. వర్షాలు కురిసినప్పుడు ఆ రోజు పరిస్థితులకు అనుగుణంగా తరగతులు నిర్వహించాలా, వద్దా.. అని నిర్ణయం తీసుకోవాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు.ఇందుకు సంబంధించిన నివేదికను కలెక్టర్‌కు అందజేశారు.
ఫ ఆలేరు ప్రభుత్వ జూనియర్ కాలేజీని సందర్శించిన డీఐఈఓ
ఫ కలెక్టర్‌కు నివేదిక

త్వరలోనే కళాశాలను తరలిస్తాం