
నీడ లేదు.. గూడు ఇప్పించరూ..
గుండాల: పూరి గుడిసె ఎదుట ఉన్న ఈ దంపతుల పేరు బొంత ఎల్లయ్య, లక్ష్మి. దంపతులిద్దరూ దివ్యాంగులే. గుండాల మండలం మాసాన్‌పల్లి. ఇద్దరు పిల్లలతో కలిసి ఈ గుడిసెలోనే ఉంటున్నారు. తల్లిదండ్రులు నిర్మించిన ఇల్లు పదేళ్ల కిత్రం కూలిపోగా తిరిగి కట్టుకునే స్థోమత లేక గుడిసెలో జీవనం సాగిస్తున్నారు. ఇందిరమ్మ ఇంటి కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. విచారణకు వచ్చిన అధికారులు బొంత ఎల్లయ్య ఫొటో తీసుకుని వెళ్లారు. కానీ, ఇల్లు మంజూరు కాలేదు. వర్షాలు, ఈదురుగాలులు వీచినప్పుడు గుడిసెలో ఉండలేకపోతున్నామని, రాత్రి సమయంలో మేల్కొని ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత స్థలం ఉన్నప్పటికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని వాపోయారు.
పూరిగుడిసెలో నివాసం ఉంటున్న బొంత ఎల్లమ్మ, లక్ష్మి దంపతులు