
కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలి
భువనగిరి : తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఫోరం ఆధ్వర్యంలో సోమవారం ఉద్యోగ జేఏసీ నాయకులు సోమవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావును ఆయన చాంబర్‌లో కలిశారు. కార్యదర్శులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. అదే విధంగా సస్పెన్షన్‌కు గురైన కార్యదర్శులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అంతుకుముందు జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్‌రెడ్డి, టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు భగత్‌కు పంచాయతీ కార్యదర్శులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌జీఓ జిల్లా కార్యదర్శి ఎండీ ఖదీర్, కోశాధికారి శ్రీకాంత్, టీజీఓ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ప్రసాద్, కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా పంచాయతీ కార్యదర్శుల అధ్యక్ష, కార్యదర్శులు శశికాంత్, రాజు, సిద్ధేశ్వర్, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.