
యాదగిరి క్షేత్రంలో పవిత్రోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఉదయం శ్రీస్వామివారికి అభిషేకం చేసిన అర్చకులు.. రాత్రి స్వస్తివాచనం, విష్వక్సేన ఆరాధనతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం పవిత్రాధివాసం వేడుక నిర్వహించారు. ఇక అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోనూ పవిత్రోత్సవాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, డిప్యూటీ ఈఓ భాస్కర్‌శర్మ, అధికారులు, అర్చకులు, ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు.
ఫ విష్వక్సేన ఆరాధనతో ప్రారంభం

యాదగిరి క్షేత్రంలో పవిత్రోత్సవాలు