
పలు ప్రాంతాల్లో వర్షం
భువనగిరి, భూదాన్‌పోచంపల్లి: జిల్లాలోని పలు మండలాల్లో అదివారం మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా చౌటుప్పల్‌లో 59 మి.మీ, వలిగొండ మండలం వర్కట్‌పల్లిలో 58 మి.మీ, భువనగిరిలో 6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సాయంత్రం ఆకాశం మేఘావృతమై గంటన్నరపాటు మోస్తరు వర్షం కురిసింది. దాంతో ప్రజలకు కాస్త ఉపశమనం కల్గింది. ఎండిపోతున్న మెట్టపంటలకు జీవం వచ్చినట్టయ్యింది.
అర్హులందరికీ
ఇందిరమ్మ ఇళ్లు
రాజాపేట : మార్నింగ్‌వాక్ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆదివారం రాజాపేట మండల కేంద్రంలో పర్యటించారు. వివిధ వార్డుల్లో తిరిగి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. ఇసుక, సిమెంట్, స్టీల్ ఏ రేట్లకు లభిస్తున్నాయని ఆరా తీశారు. ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. లబ్ధిదారులకు సహకరించాని అధికారులకు స్పష్టం చేశారు. రాజాపేటలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని, చెరువల ద్వారా సాగునీరు అందించాలని బీజేపీ నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ విఠల్‌నాయక్, నాయకులు పెంటయ్యగౌడ్, ఇంజ నరేష్, సురేందర్, శ్రీశైలం, కేదారి, లక్ష్మణ్, శ్రవణ్, రమేష్ పాల్గొన్నారు.
7న భువనగిరికి బీజేపీ
రాష్ట్ర అధ్యక్షుడి రాక
భువనగిరి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఈనెల 7న భువనగిరిలో పర్యటించనున్నారని పార్టీ జిల్లా ప్రభారి చాడ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అశోక్ తెలిపారు. అదివారం భువనగిరిలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత బస్టాండ్ నుంచి వినాయకచౌరస్తా మీదుగా ఎంఎన్‌ఆర్ గార్డెన్ వరకు రోడ్ షో ఉంటుందన్నారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణరెడ్డి, పోతంశెట్టి రవీందర్, కర్నాటి ధనుంజయ్య, పడమటి జగనోహ్మన్‌రెడ్డి, నర్ల నర్సింగ్‌రావు, చందా మహేందర్ గుప్తా, శివకుమార్, పట్నం శ్రీనివాస్, అచ్చయ్య, పట్టణ, మండల కమిటీ అధ్యక్షుడు రత్నపురం బలరాం, సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పలు ప్రాంతాల్లో వర్షం