
ప్రతి భక్తుడికి 30గ్రాములకు తగ్గకుండా ప్రసాదం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఉచిత ప్రసాదం 30 గ్రాములకు తగ్గకుండా అందించాలని ఈఓ వెంకట్రావ్ ప్రసాద విక్రయ విభాగం అధికారులను ఆదేశించారు. ఆదివారం ప్రసాద వితరణను ఆయన పరిశీలించారు. ఆలయ భద్రతకు సంబంధించి ఆలయ లోపలి భాగం, ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టంగా చేయాలన్నారు. ఆలయంపై డ్రోన్స్ ఎగురకుండా నిషేధించుటకు భద్రత సిబ్బందికి అవసరమైన ప్రత్యేక శిక్షణ ఇవ్వాలన్నారు. శ్రీస్వామి వారి దర్శనం అనంతరం భక్తులను పశ్చిమ రాజగోపురం నుంచి (ప్రసాద వితరణ మార్గంలో) మాత్రమే బయటకు అనుమతించాలని పేర్కొన్నారు.
గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
చౌటుప్పల్ : పట్టణ కేంద్రంలోని పలు దుకాణాల్లో ఆదివారం పోలీసుల తనిఖీలు చేశారు. దుకాణాల్లో నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను, విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.