
సాగు నీరు అందించడంలో పాలకులు విఫలం
కేతేపల్లి : శ్రీశైలం, నాగర్జునసాగర్ ప్రాజెక్టుల గేట్ల ద్వారా నీరు విడుదలవుతున్నప్పటికీ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం అవగాహన లేకుండా నల్లగొండ జిల్లాను ఎండబెడుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. ఆదివారం కేతేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు ఫొటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప కాల్వల ద్వారా పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు నీరందించలేకపోతున్నారని మండిపడ్డారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ముందు చూపు లేకే ఈపరిస్థితులు నెలకొన్నాయన్నారు. సీజన్‌లో నీరందక నల్లగొండ జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నకిరేకల్ నియోజవర్గంలో విచ్చలవిడిగా ఇసుక దందా నడుస్తున్నా అరికట్టడంలో అధికార యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అద్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి, నాయకులు గుర్రం గణేష్, గోలీ వేణు, మాధవరెడ్డి, కొండ సైదులు, వంటల చేతన్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య