
ఎమ్మెల్యే అయినా.. స్నేహాన్ని మరువలే..!
గుండాల: గురుకుల పాఠశాలలో ఏర్పడిన స్నేహం నేటికీ కొనసాగుతోంది. వారిలో ఒకరు ఎమ్మెల్యే కాగా.. మరొకరు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అయ్యారు. గుండాల మండలం మోత్కూరు గ్రామానికి చెందిన జంపాల రాజు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ 30 ఏళ్ల క్రితం సర్వేల్ గురుకులంలో స్నేహితులయ్యారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. ఒకరు ఎమ్మెల్యే కాగా మరొకరు, ప్రధానోపాధ్యాయుడు. గాదరి కిషోర్‌కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ తన మిత్రుడు రాజు కుటుంబాలతో స్నేహంగా ఉండేవారు. నాటి నుంచి నేటి వరకు తన స్నేహం అలాగే కొనసాగుతోంది.

ఎమ్మెల్యే అయినా.. స్నేహాన్ని మరువలే..!