బైక్‌లు చోరీ చేస్తున్న దొంగల రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

బైక్‌లు చోరీ చేస్తున్న దొంగల రిమాండ్‌

Aug 3 2025 8:48 AM | Updated on Aug 3 2025 8:48 AM

బైక్‌లు చోరీ చేస్తున్న దొంగల రిమాండ్‌

బైక్‌లు చోరీ చేస్తున్న దొంగల రిమాండ్‌

నార్కట్‌పల్లి: డూప్లికేట్‌ తాళంచెవిలు ఉపయోగిస్తూ బైక్‌లు చోరీ చేస్తున్న దొంగలను నార్కట్‌పల్లి పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించారు. ఈ కేసు వివరాలను నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి శనివారం నార్కట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. గతేడాది నవంబర్‌ 3వ తేదీన నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు పైన కేతేపల్లి మండలం ఇనుపముల గ్రామానికి చెందిన తిరుగుడు సతీష్‌ బైక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. సతీష్‌ ఫిర్యాదు మేరకు నార్కట్‌పలి్‌ల్‌ పోలీసు కేసు నమోదు చేశారు. శనివారం నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని అమ్మనబోలు చౌరస్తాలో వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు రామన్నపేట మండలం ఎయన్నారం గ్రామానికి చెందిన మట్టిపల్లి వెంకన్న, మట్టిపల్లి అనిల్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా.. వారు జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ తాళంచెవిలు ఉపయోగించి బైక్‌లు చోరీ చేస్తున్నట్లు నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి 12 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరు తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. వీరితో పాటు యన్నారం గ్రామానికే చెందిన మట్టిపల్లి శ్రీకాంత్‌ కూడా ఈ చోరీల్లో పాలుపంచుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. శ్రీకాంత్‌ ప్రస్తుతం ఏపీలోని పిడుగురాళ్లలో నివాసముంటుండగా.. ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ నాగరాజు, ఎస్‌ఐ క్రాంతికుమార్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఫ 12 బైక్‌లు స్వాధీనం

ఫ వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement