
నాడు తండ్రులు.. నేడు కుమారులు
నకిరేకల్: నకిరేకల్ పట్టణానికి చెందిన వీర్లపాటి వెంకటేశ్వర్లు, కందగట్ల వెంకటేశ్వర్లు 1980లో నల్లగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివే నాటి నుంచి వారి మధ్య స్నేహబంధం ఏర్పడింది. నల్లగొండలో ఒకే రూమ్‌లో కలసి ఉంటూ డిగ్రీ, పీజీ చేశారు. వీర్లపాటి వెంకటేశ్వర్లు సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తూ ఇటీవల రిటైర్డ్ అయ్యారు. కందగట్ల వెంకటేశ్వర్లు పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ చేసి డాక్టరేట్ పొంది నకిరేకల్‌లోనే లెక్చరర్‌గా, వాసవి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా సేవలందించారు. నేడు వారిరువురి కుమారులైన వీర్లపాటి అభినవ్, కందగట్ల జయదీప్‌లు కూడా అత్యంత మిత్రులుగా మారారు. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే కాలం నుంచి ఆప్తులుగా మారారు. చిన్ననాటి నుంచి వారి తండ్రులు స్నేహితులు కావడం, తరుచూ ఆ రెండు కుటుంబాలు కలుసుకుంటూ ఉండడంతో దోస్తానం వారిని ఆప్త మిత్రులుగా మార్చింది. ఆస్ట్రేలియాలో అభినవ్, అమెరికాలో జయదీప్ ఎంఎస్ చదివారు. వారి స్నేహానికి అమెరికాలో యాదృశ్చికంగానే ఒకే ఆఫీస్‌లో ఇరువురికి ఉద్యోగం లభించింది. ఇప్పుడు అమెరికాలోని హరిజోన్ రాష్ట్రంలో ఉద్యోగం చేస్తూ స్నేహమేరా జీవితం అంటూ తండ్రుల స్నేహాన్ని వారు పదిలంగా పంచుకుంటూ కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నారు.

నాడు తండ్రులు.. నేడు కుమారులు

నాడు తండ్రులు.. నేడు కుమారులు