
అండగా ఉంటున్న ‘ఆల్ మై ఫ్రెండ్స్’
దేవరకొండ: దేవరకొండ జెడ్పీహెచ్‌ఎస్ 1989–90 బ్యాచ్‌కు చెందిన 84మంది పదో తరగతి విద్యార్ధులు ఆల్ మై ఫ్రెండ్స్ పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని తమ స్నేహితులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. 2015లో ఏర్పాటు చేసుకున్న ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా తమతో పాటు చదువుకున్న స్నేహితులకు ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించడంతో పాటు ఆపద సమయాల్లో మేమున్నాం అంటూ అండగా నిలుస్తున్నారు. మొదట్లో గ్రూప్ సభ్యులకు మాత్రమే సహాయ సహకారాలు పరిమితం కాగా ప్రస్తుతం వారి సేవలను విస్తృతపర్చారు. గతేడాది తమ స్నేహితుడైన ఆంజనేయులు అనారోగ్యానికి గురికావడంతో మిత్రులంతా కలిసి రూ.లక్ష ఆర్థికాసాయం అందజేశారు. మరో స్నేహితుడు కృష్ణమాచారి అనారోగ్యంతో మృతిచెందడంతో అతని కుటుంబానికి రూ.1.80లక్షలు అందజేశారు. ఇటీవల జరిగిన కర్నాటి ఆంజనేయులు కుమార్తె వివాహానికి రూ.55వేలు అందించి భరోసా కల్పించారు.

అండగా ఉంటున్న ‘ఆల్ మై ఫ్రెండ్స్’