
ఉద్యోగ సాధనలోనూ కలిసికట్టుగా..
పెన్‌పహాడ్: పెన్‌పహాడ్ తహసీల్దార్‌గా పనిచేస్తున్న చివ్వెంల మండలం గుడిరాంతండా ఆవాసం హలావత్‌తండాకు చెందిన లాలు 2001–2003 విద్యాసంవత్సరంలో సూర్యాపేటలోని బ్రిలియంట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో నకిరేకల్ మండలం చెరువుమాదారం గ్రామానికి చెందిన నర్సింగ్ కరుణాకర్‌తో స్నేహం ఏర్పడింది. కళాశాలలో ప్రారంభమైన వీరి స్నేహం ఉద్యోగ సాధనలోనూ కొనసాగింది. 2006లో ఇద్దరు డీఎస్సీ రాయగా ఇద్దరికి ఎస్‌జీటీలు ఉద్యోగాలు రావడంతో టీచర్లుగా పనిచేశారు. అనంతరం 2016లో ఇద్దరు కలిసి గ్రూప్–2 పరీక్షలు రాయగా ఇద్దరూ డిప్యూటీ తహసీల్దార్లుగా ఎంపికయ్యారు. నర్సింగ్ కరుణాకర్ ప్రస్తుతం గద్వాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తుండడంతో సమయం కుదరక రెండు నెలలకోసారి కలుసుకుని యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.