
తొలిరోజు 97శాతం ముఖ హాజరు
భువనగిరి: ఉపాధ్యాయుల హాజరులో పారదర్శకత కోసం రాష్ట్ర విద్యాశాఖ తీసుకువచ్చిన ఫేస్ రికగ్నేషన్ విధానం శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి వచ్చింది. తొలిరోజు 97 శాతం మంది ఉపాధ్యాయులు యాప్‌లో ఫొటో దిగి హాజరు నమోదు చేశారు.
2,635 మంది రిజిస్ట్రేషన్
జిల్లాలో 670 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది 3,494 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 2,635 మంది ఉపాధ్యాయులు తమ వివరాలను ఫేస్ రికగ్నేషన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోగా.. మొదటి రోజు అందరి హాజరు నమోదైంది. ఫేస్ రికగ్నేషన్‌కు ముందు తమకు కేటాయించిన యూజర్ పేరు, పాస్‌వర్డ్‌తో యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. జీపీఆర్‌ఎస్‌తో అనుసంధానం చేసినందున ఇది పాఠశాల ఆవరణలోనే సాధ్యమవుతుంది.
పలుచోట్ల సాంకేతిక సమస్యలు
మొదటి రోజు కావడంతో పలు పాఠశాలల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఉపాధ్యాయులు సంబంధిత నిపుణులను సంప్రదించి వెంటనే లోపాలను సరిదిద్దారు.
ఫ పాఠశాలల్లో అమల్లోకి
ఫేస్ రికగ్నేషన్ విధానం
ఫ యాప్‌లో ఫొటో దిగి విధులకు హాజరైన ఉపాధ్యాయులు

తొలిరోజు 97శాతం ముఖ హాజరు