
అమ్మపాలు.. బిడ్డకు అమృతం
భువనగిరిటౌన్ : సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలో తల్లిపాల వారోత్సవాలను ప్రా రంభించారు. మొదటి రోజు మోత్కూరు, గుండాల తదితర ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. తల్లిపాల ఆవశ్యకతపై అధికారులు అవగాహన కల్పించారు.
● 2న తల్లిపాల ఆవశ్యకతను తెలియజేసే పోస్టర్లు ప్రదర్శిస్తారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రాలు, ఉప కేంద్రాల్లో సమావేశాలు నిర్వహించి గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తారు.
● 3న గ్రామ, వార్డుస్థాయిలో అన్నప్రాసనలు.
● 5నుంచి 6వ తేదీ వరకు గృహాలను సందర్శిస్తారు. ఆరు నెలల లోపు, 6నుంచి 24 నెలల వయసున్న పిల్లలకు తల్లి పాలిచ్చే విధానం, పోషకాహారం అందించే విధానం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తారు.
● 7న స్వయం సహాయక బృందాల సహాయంతో పిల్లలు, మహిళల శ్రేయస్సు కోసం వివిధ అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
వారోత్సవాలను విజయవంతం చేయాలి
బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరమని, ఆరు నెలల వరకు తల్లిపాలే పట్టించాలని జిల్లా సంక్షేమ శాఖ ఇంచార్జ్ అధికారి జ్యోత్స్న పేర్కొన్నారు. మొదటి రోజు జిల్లా కేంద్రంలో నిర్వహించిన వారోత్సవాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. తల్లిపాలు బిడ్డకు దివ్య ఔషధమని, లేకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. తల్లిపాల ఆవశ్యతను తెలియజేసేందుకు సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, గర్భిణులు, బాలింతలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఫ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం
ఫ 7వ తేదీ వరకు కార్యక్రమాలు