
యాదగిరి క్షేత్రంలో స్వాతినక్షత్ర పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వాతినక్షత్ర పూజలు వేడుకగా చేపట్టారు. స్వామివారి జన్మనక్షత్రం కావడంతో భక్తులు, ఆలయ ఉద్యోగులు, అర్చకులు వేకువజామున గిరిప్రదక్షిణ చేశారు. ఇక ఆలయ ముఖ మండపంలో స్వాతి హోమంతో పాటు పంచామృతాలు, శుద్ధజలాలు, పుష్పాలు, సుగంధ ద్రవ్యాలతో నింపిన బంగారు, వెండి కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలకారమూర్తులకు అష్టోతర శతఘటాభిషేకం చేశారు. అదే విధంగా నిత్యారాధనలు కొనసాగాయి.
పూర్ణగిరిలో..
భువనగిరి: మండలంలోని నమాత్‌పల్లిలో గల పూర్ణగిరి శ్రీ సుదర్శన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గిరిప్రదక్షిణ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ రావి సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో శ్రీత్రిదండి రామానుజ చిన్నజీయర్‌స్వామి శిశ్యులచే స్వామివారికి నవకలశ స్నపనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన దాత మొసలి ఉదయకుమార్‌రెడ్డి, ప్రధానార్చకులు పవన్‌కుమార్ శర్మ, ధర్మకర్తలు సురుపంగ పద్మ నరసింహ, ఎల్లంల జంగయ్య యాదవ్, బత్తిని సుధాకర్‌గౌడ్, పబ్బతి ఉప్పలయ్య, ఆలయ సేవకులు కంబాలపల్లి రఘునాత్, కొత్తపల్లి నాగయ్య పాల్గొన్నారు.