
నిబద్ధతో పనిచేసినప్పుడే గుర్తింపు
భువనగిరిటౌన్ : ఉద్యోగులు నిబద్ధతో పనిచేసినప్పుడే గుర్తింపు ఉంటుందని కలెక్టర్ హనుమంతరావు పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి యాదయ్య ఉద్యోగ విరమణ సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సన్మాన సభలో ఆయన మాట్లాడారు. ఉద్యోగులు పనిచేసే చోట చిత్తశుద్ధితో వ్యవహరించి మంచిపేరు తెచ్చుకోవా లని కోరారు. ఉద్యోగ విరమణ అనంతరం శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని సూచించారు. వీలైనంత వరకు సేవా కార్యక్రమాలు చేయాలన్నా రు. అనంతరం అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావుతో కలిసి యాదయ్యను సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీజీఓల సంఘం రాష్ట్ర కోశాధికారి మందడి ఉపేందర్ రెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్ ప్రసాద్, టీజీఓ సభ్యులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.