
యాదగిరిగుట్ట ప్రధానార్చకుడి ఉద్యోగ విరమణ
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహాస్వామి ఆలయ ప్రధానార్చకులుగా విధులు నిర్వహిస్తున్న నల్లంథీఘల్ లక్ష్మీనరసింహాచార్యులు గురువారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ వెంకట్రావ్‌తో పాటు ఆలయ అర్చకులు, అధికారులు ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. స్వామివారికి ఆయన చేసిన సేవలను ఆలయ ఉద్యోగులు గుర్తుచేసుకున్నారు. పాత ఆలయం నుంచి ఆలయ పునర్నిర్మాణం వరకు ఆయన చేసిన సేవలు మరువలేనివని స్థానికులు చెబుతున్నారు.
46ఏళ్ల పాటు సేవలు
యాదగిరిగుట్ట దేవస్థానంలో ప్రధానార్చకులుగా విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన నరసింహాచార్యులు జన్మస్థలం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వేణుగోపాలపురం గ్రామం. ఆయన వైధిక విద్యను అభ్యసిస్తూనే ఎంఏ తెలుగు, సంస్కృతం వేద ఆగమాలపై గ్రంథ రచనలు చేసి డాక్టరేట్ పట్టా పొందారు. తొలుత ఈయననల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరి సీతారామచంద్రస్వామి ఆలయంలో అర్చకత్వం చేశారు. అనంతరం 1979 డిసెంబర్‌లో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో అర్చకుడిగా విధుల్లో చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రభుత్వం ఆయనను ఆలయ ప్రధానార్చకులుగా నియమించింది. లక్ష్మీనరసింహుడి సన్నిధిలో 46 సంవత్సరాల పాటు ఆయన తన సేవలు అందించారు.
ఘనంగా సత్కరించిన ఈఓ, అర్చకులు, అధికారులు