
దొడ్డా పద్మ ఆశయాలు సాధించాలి
చిలుకూరు: హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే దొడ్డా నర్సయ్య సతీమణి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు దొడ్డా పద్మ ఆశయాలను సాధించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బుధవారం చిలుకూరులో దొడ్డా పద్మ భౌతికకాయానికి కూనంనేని సాంబశివరావు నివాళులర్పించి ఆమె అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సమయంలో తన భర్త దొడ్డా నర్సయ్యతో కలిసి నల్లమల్ల అడవుల్లో మూడేళ్లు పాటు పద్మ అజ్ఞాతవాసం చేసిందని, కొరియర్‌గా కూడా సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. పార్టీ నాయకులు దొడ్డా పద్మమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఆమె ఆశయసాధనకు కృషి చేయాలని అన్నారు. దొడ్డా పద్మ మృతి సీపీఐకి తీరని లోటని అన్నారు. దొడ్డా పద్మ మృతి పట్ల సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ నెలికంటి సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొమ్మగాని ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్‌రావు, ఉజ్జిని యాదగిరిరావు, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు ఉజ్జిని రత్నాకర్, పార్టీ జాతీయ నాయకులు పశ్య పద్మ, పోటు కళావతి, సీపీఐ సూర్యాపేట, ఖమ్మం జిల్లాల కార్యదర్శులు బెజవాడ వెంకటేశ్వర్లు, దండి సురేష్, రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఉస్తెల సృజన, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, ప్రముఖ వైద్యుడు జాస్తి సుబ్బారావు, మండల కార్యదర్శి, సహాయ కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, సాహెబ్ అలీ, జిల్లా కార్యవర్గ సభ్యులు యల్లావుల రాములు, ధనుంజయ నాయుడు, మేకల శ్రీనివాస్, ఉస్తెల నారాయణరెడ్డి, బద్దం కృష్ణారెడ్డి, లతీఫ్, బత్తిని హనుమంతరావు, దేవరం మల్లేశ్వరీ, గుండు వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం..
దొడ్డా పద్మ మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ఆమె మరణం తీవ్ర ఆవేదనను కలిగించిందని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని, పద్మ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అదేవిధంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి ఫోన్‌లో పద్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. పద్మ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
కూనంనేని సాంబశివరావు
చిలుకూరులో ముగిసిన పద్మ
అంత్యక్రియలు

దొడ్డా పద్మ ఆశయాలు సాధించాలి