
బీబీనగర్ పీహెచ్‌సీలో మందుల కొరత
బీబీనగర్: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల కొరత ఉండడంతో జిల్లా వైద్యాధికారిపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. వ్యాధులు వ్యాప్తి చెందే సమయంలో మందుల కొరత లేకుండా చూసుకోవాలి కదా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. అదే సమయంలో ఒక పేషెంట్ మందుల చిట్టీతో పీహెచ్‌సీకి వచ్చాడు. ఇక్కడ మందులు లేవు, బయట తీసుకోవాలని సిబ్బంది చెప్పడంతో సదరు రోగి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు. కలెక్టర్ స్పందించి.. జిల్లాలో మందుల కొరత లేదని, బీబీనగర్ పీహెచ్‌సీలోనే మందులు లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. సిబ్బందినుంచి సరైన సమాధానం రాకపోవడంతో డీఎంహెచ్‌ఓకు ఫోన్ చేశారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలి కదా.. అని సీరియస్ అయ్యారు. అనంతరం నూతన పీహెచ్‌సీ భవనాన్ని సందర్శించి పనులను పరిశీలించారు. పెండింగ్ పనులు త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్‌కు పెండింగ్ బిల్లు చెల్లించాలని సూచించారు. అలాగే బీబీనగర్‌లోని ఎరువుల దుకాణం, గోదాంను తనిఖీ చేశారు. ఎరువుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఫ డీఎంహెచ్‌ఓపై కలెక్టర్ సీరియస్