
అక్రమ కేసులకు భయపడం
ఆలేరు: బీఆర్‌ఎస్ నాయకులపై పోలీసులు పెట్టే అక్రమ కేసులకు భయపడబోమని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆలేరులో నిర్వహించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న అనంతరం.. స్థానిక అతిథి గృహంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలను అణచివేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలో భాగంగా పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.బీఆర్‌ఎస్ సోషల్ మీడియా వారియర్స్‌తోపాటు నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని తప్పుబట్టారు. పోలీస్ స్టేషన్లను కాంగ్రెస్ కార్యాలయాలుగా మారుస్తున్నారని విమర్శించారు. అందరికీ ఒకేలా పోలీసులు పనిచేయాలే తప్ప.. వివక్ష చూపడం తగదన్నారు. ఆలేరు సీఐ కొండల్‌రావు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఏజెంట్‌లా పనిచేస్తున్నాడని ఆరోపించారు. పలు భూవివాదాల్లో తలదూరుస్తూ పోలీస్ స్టేషన్‌ను సెటిల్‌మెంట్లకు కేంద్రంగా మార్చుకున్నారని ఆరోపించారు. సీఐ తన వైఖరిని మార్చుకోకపోతే కేటీఆర్, హరీష్‌రావులతో ఆలేరు పట్టణంలో బ హిరంగసభ ఏర్పాటు చేసి వ్యవహారాలన్నీ బయటపెడతామని హెచ్చరించారు. రాజకీయాలు చేయాలనుకుంటే సీఐ తన ఉద్యోగా నికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా లేదా.. ఏపదవికై నా పోటీ చేయాలని సూచించారు. అధికారుల వివరాలన్నీ రాసిపెడుతున్నామని, మళ్లీ అధికారంలోకి వస్తామన్న విషయాన్ని వారు గ్రహించాలన్నారు. అమలుకు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు. రైతుబీమాకు ప్రీమియం రూ.900 కోట్లు ఎందుకు చెల్లించడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. మదర్ డెయిరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వస్పరి శంకరయ్య, పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్, మాజీ అధ్యక్షులు మొరిగాడి వెంకటేష్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీలు బొట్ల పరమేశ్వర్, పల్లా వెంకట్‌రెడ్డి,నవీన్,హరికృష్ణ,చందు తదితరులు పాల్గొన్నారు.
ఫ బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డి