
ఆలేరులో ఆగిన కేంద్ర మంత్రులు
ఆలేరు: కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి శనివారం రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుతో కలిసి సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో కాజీపేటకు వెళ్తూ ఆలేరు రైల్వేస్టేషన్‌లో కాసేపు ఆగారు. మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్‌గౌడ్, రాష్ట్ర, జిల్లా నాయకులు గూడూరు నారాయణరెడ్డి, చందామహేందర్‌గుప్తా, చిరిగే శ్రీనివాస్ తదితరులు మంత్రులకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లలోని పలు సమస్యలపై, ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిపేలా చర్యలు తీసుకోవాలని వినతులు అందజేశారు. స్వాగతం పలికినవారిలో పాశంభాస్కర్, గంగేష్, కుమారస్వామి, ఏలే చంద్రశేఖర్, కామిటికారి కృష్ణ, వడ్డేమాన్ నరేందర్ పన్నాల చంద్రశేఖర్, మంగ నర్సింహులు, ప్రవీణ్,సుభాస్ వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
వినతులు ఇవీ..
● పద్మావతి ఎక్స్‌ప్రెస్‌కు యాదాద్రి పేరు పెట్టాలి.
● శాతవాహన, పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లను ఆలేరు, భువనగిరిలో హాల్టింగ్ ఇవ్వాలి.
● పాత వివేరా హోటల్ సమీపంలో ఆర్‌ఓబీ, ఆలేరు గుండ్లగూడెంలో అండర్‌పాస్ నిర్మించాలి.
● ఆలేరు, భువనగిరి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని విన్నవించగా రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు అశోక్‌గౌడ్ తెలిపారు.
ఫ స్వాగతం పలికిన బీజేపీ నాయకులు
ఫ వివిధ సమస్యలపై వినతులు అందజేత, మంత్రులనుంచి సానుకూల స్పందన