
నెలకు రూ.2 వేలు ఆదాయం వస్తోంది
ప్రతీక్‌రెడ్డి ఫౌండేషన్ సహకారంతో మా ఇంట్లో ఏర్పాటు చేసిన సోలార్ ఆఫ్‌గ్రిడ్ కోఆపరేటివ్ సిస్టమ్‌తో నెలకు రూ.2 వేలు ఆదాయం వస్తోంది. నాలుగు నెలలుగా రూ.6 వేల ఆదాయం వచ్చింది. సోలార్ ప్లేట్‌ల క్లీనింగ్, సిబ్బందికి సహకరించడం తప్ప ఎలాంటి రిస్క్ లేదు. సోలార్ ప్యానల్‌కు కోతుల బెడద లేకుండా సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
–ముక్కెర అనిత, అయిటిపాముల
మధ్య తరగతి కుటుంబాలకు పెద్ద సాయం
ప్రభుత్వ ద్వారా అయితే యూనిట్‌కు రూ.3 నుంచి రూ.4 వరకు ఆదాయం లభిస్తుంది. స్వబాగ్ ల్యాబ్ వారు యూనిట్‌కు రూ.16.50 చెల్లిస్తున్నారు. అదనంగా సోలార్ ప్యానల్ యూనిట్ల సంఖ్య పెంచుకుంటే మహిళలు ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందేందుకు అవకాశం ఉంది. మధ్య తరగతి కుటుంబాలకు ఇది చాలా పెద్ద సహాయం.
– చెవుగోని సైదమ్మ, ఎఫ్‌పీఓ చైర్మన్, అయిటిపాముల
సోలార్ ప్యానెల్‌తో
డైరెక్ట్‌గా బ్యాటరీ చార్జింగ్
సోలార్ విద్యుత్ బ్యాటరీ దేశంలోనే ఇది మొదటి పైలెట్ ప్రాజెక్ట్. సూర్యశక్తిని వినియోగించుకుని ఆదాయం సంపాదించుకునేందుకు ఇది మంచి అవకాశం. ఎలక్ట్రిక్ వాహనాలకు విద్యుత్‌కు బదులుగా ఈ బ్యాటరీలను ఉపయోగించుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ఇది ఎంతగానే ఉపయోగపడుతుంది. భవిష్యత్‌లో మరిన్ని స్వచ్ఛ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మేమే బ్యాటరీలను కొనుగోలు చేసి ప్రతి మహిళకు నెలకు రూ.2 వేలను ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తున్నాం.
– జి.సుధాకర్‌బాబు, సీఈఓ స్వబాగ్ ల్యాబ్స్

నెలకు రూ.2 వేలు ఆదాయం వస్తోంది

నెలకు రూ.2 వేలు ఆదాయం వస్తోంది