అక్క, తమ్ముడు అదుర్స్‌ | - | Sakshi
Sakshi News home page

అక్క, తమ్ముడు అదుర్స్‌

Jul 21 2025 4:59 AM | Updated on Jul 21 2025 4:59 AM

అక్క,

అక్క, తమ్ముడు అదుర్స్‌

భువనగిరి: చిన్న వయస్సులో ప్రపంచ దేశాలు వాటి రాజధానుల పేర్లను తక్కువ సమయంలో చెప్పి అదుర్స్‌ అనిపిస్తున్నారు అక్క, తమ్ముడు. భువనగిరి పట్టణంలోని శ్రీ ఆర్‌కే ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్‌ రాజ్‌కుమార్‌, డాక్టర్‌ ఆశ్లేష దంపతులకు కుమార్తె ఆకృతి, కుమారుడు తారక్‌ నంద సంతానం. ఆకృతి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 5వ తరగతి చదువుతుండగా.. తారక్‌ నంద భువనగిరి పట్టణంలోని హ్యాపీ మెడల్స్‌ పాఠశాలలో 1వ తరగతి చదువుతున్నాడు. ఆకృతి 3వ తరగతిలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ప్రపంచ దేశాలు వాటి రాజధానుల పేర్లను ఆమెకు నేర్పించడం ప్రారంభించారు. అయితే తక్కువ సమయంలో చెప్పడం దేశాలు, వాటి రాజధానుల పేర్లు చెబితే ఎలా ఉంటుందనే అలోచన ఆకృతికి వచ్చింది. ఈ ఆలోచననే తండ్రి రాజ్‌కుమార్‌తో పంచుకుంది. దీంతో రాజ్‌కుమార్‌ కుమార్తె ఆకృతిని ప్రోత్సహిస్తూ రాత్రి సమయంలో ప్రపంచ దేశాలు, వాటి రాజధానుల పేర్లను పూర్తిగా నేర్పించి తక్కువ సమయంలో వాటిని చెప్పడం ప్రాక్టీస్‌ చేయించాడు. సుమారు నెల రోజుల పాటు ప్రాక్టీస్‌ చేసి 194 దేశాలు వాటి పేర్లను ఆకృతి 10 నిమిషాల్లో చెప్పడం ప్రారంభించింది. అనంతరం 2023 జూన్‌ 7న నిర్వహించిన పోటీల్లో 194 దేశాలు, వాటి రాజధానుల పేర్లను ఆకృతి 4 నిమిషాల 35 సెకండ్లలో చెప్పి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించుకుంది.

అక్కను ఆదర్శంగా తీసుకుని..

అక్క ఆకృతిని ఆదర్శంగా తీసుకుని ఆమె సోదరుడు తారక్‌ నంద తాను కూడా దేశాలు వాటి రాజధానుల పేర్లను నేర్చుకుని ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకోవాలని భావించాడు. అతడిని ప్రోత్సహించేందుకు గాను.. అక్క లాగా నేర్చుకుని ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకెళ్తామని తల్లిదండ్రులు చెప్పడంతో తారక్‌ నంద పట్టుదలతో వాటిని నేర్చుకోవడం ప్రారంభించాడు. 2024 వేసవి సెలవుల్లో తారక్‌ నంద ప్రతిరోజు సుమారు 6 గంటల పాటు కష్టపడి దేశాలు వాటి రాజధానుల పేర్లను నేర్చుకోవడంతో పాటు తక్కువ సమయంలో చెప్పడం ప్రాక్టీస్‌ చేశాడు. రాత్రి సమయంలో విధులను ముగించుకుని వచ్చిన తర్వాత తండ్రి రాజ్‌కుమార్‌ కుమారుడికి కొంత సమయాన్ని కేటాయించి ప్రాక్టీస్‌ చేయించడం అతనికి ఎంతో ఉపయోగంగా మారింది. ఇదే సమయంలో ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన పోటీల్లో తారక్‌ నంద 100 దేశాలు వాటి రాజధానులను ఒక నిమిషం 53 సెకండ్లలో చెప్పి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో తన పేరునూ నమోదు చేసుకున్నాడు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో తారక్‌ నందకు నిర్వాహకులు సర్టిఫికెట్‌ను అందజేశారు. ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ పేరు నమోదు చేసుకోవాలనే తపన తారక్‌ నందలో పెరిగింది. దీంతో మరింత ప్రాక్టీస్‌ చేయడం ప్రారంభించాడు. 2025 మార్చిలో ఆన్‌లైన్‌ ద్వారా జరిగిన పోటీల్లో తారక్‌ నంద పాల్గొని 196 దేశాలు వాటి రాజధానుల పేర్లను కేవలం 4 నిమిషాల 20 సెకండ్లలో చెప్పి ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. ఇటీవల తారక్‌ నందను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావుతో పాటు భువనగిరి డీసీపీ అక్షాంశ్‌ యాదవ్‌ సైతం అభినందించారు.

ఐదో తరగతి, ఒకటో తరగతి చదివే చిన్నారులు స్కూల్‌ నుంచి వచ్చిన తర్వాత ఆటలు ఆడుతూ సరదాగా గడుపుతుంటారు. కానీ ఈ అక్క, తమ్ముడు ప్రపంచ దేశాలు, వాటి రాజధానుల పేర్లు నిమిషాల వ్యవధిలో చెబుతూ రికార్డులు

సృష్టిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నిరంతర సాధనతో మిగతా పిల్లల కంటే ప్రత్యేకంగా తమను తీర్చిదిద్దుకున్నారు.

ఫ తక్కువ సమయంలో ప్రపంచ

దేశాలు, వాటి రాజధానుల పేర్లు

చెప్పడంలో దిట్ట

ఫ ఇండియన్‌, ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో పేరు నమోదు

చేసుకున్న ఆకృతి, తారక్‌ నంద

అక్క, తమ్ముడు అదుర్స్‌1
1/1

అక్క, తమ్ముడు అదుర్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement