
స్వచ్ఛతలో వెనుకడుగు..
భువనగిరిటౌన్ : స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఈసారి జిల్లాలోని మున్సిపాలిటీలు మిశ్రమ ఫలితాలు సాధించాయి. భువనగిరి మినహా మిగతా ఐదు మున్సిపాలిటీ ఆశించిన స్థాయిలో ర్యాంకులు సాధించలేకపోయాయి. ఓడీఎఫ్, పారిశుధ్య నిర్వహణ, చెత్త సేకరణ, సేకరించిన వ్యర్థాల రీసైక్లింగ్‌కు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర బృందం మున్సిపాలిటీల్లో సర్వే చేసింది. రెండు విడతల్లో సేకరించిన సమగ్ర వివరాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం దేశ్యాప్తంగా గురువారం ర్యాంకులు ప్రకటించింది. ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో మున్సిపల్ యంత్రాంగం పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రస్థాయిలో 143 మున్సిపాలిటీలు
స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల కోసం రాష్ట్రస్థాయిలో 143 మున్సిపాలిటీలు పోటీపడ్డాయి. ఇందులో లక్ష లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో భువనగిరికి 33వ ర్యాంకు దక్కింది. 50వేల జనాభా లోపు.. యాదగి రిగుట్ట, మోత్కూరు, ఆలేరు, చౌటుప్పుల్, భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీలు నిరాశపరిచాయి.
ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోవడంతోనే..
కేంద్ర బృందం స్వచ్ఛ్ సర్వేక్షణ్ సర్వేలో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఇంటింటి చెత్త సేకరణ సరిగా జరగకపోవడం, ప్రజలకు తగిన రీతిలో సౌకర్యాలు కల్పించకపోవడం, నిర్దేశిత అంశాలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడం ర్యాంకులపై ప్రభావం చూపి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఫ చెత్త సేకరణ, పారిశుద్ధ్యం, ప్రజలకు సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం
ఫ మెరుగైన ర్యాంకు సాధించటంలో మున్సిపాలిటీలు విఫలం
ర్యాంకులు ఇలా..
మున్సిపాలిటీ ర్యాంకు మార్కులు
భువనగిరి 33 7,920
యాదగిరిగుట్ట 68 6,914
మోత్కూరు 99 6,021
ఆలేరు 102 5,866
చౌటుప్పల్ 104 5,834
పోచంపల్లి 128 4,806