
కొలిక్కిరాని చర్చలు
సాక్షి,యాదాద్రి : గంధమల రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న వీరారెడ్డిపల్లి రైతులతో శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్ ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. ఎకరాకు రూ.24.50 లక్షలు పరిహారం చెల్లిస్తామనగా అందుకు రైతులు అంగీకరించలేదు. రూ.42 లక్షల చొప్పున ఇవ్వాలని కోరగా.. రూ.24 లక్షలు ఇస్తామని అధికారులు చెప్పారు. దీంతో రైతులు మధ్యలోనే వెళ్లిపోయారు. మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉందని అధికారి ఒకరు తెలిపారు.
నేరాల నియంత్రణే లక్ష్యం
తుర్కపల్లి: నేరాల నియంత్రణే లక్ష్యంగా నాకబంది తనిఖీలు నిర్వహంచినట్లు డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు.తుర్కపల్లి మండలం వాసాలమర్రి వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని ఏడు వాహనాలకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు, నేరస్తులను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా స్పెషల్‌డ్రైవ్ నిర్వహించినట్లు చెప్పా రు. కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్‌నాయుడు, ఎస్‌ఐ తక్కుద్దిన్, ఏఎస్‌ఐ బాలనరసింహ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నేత్రపర్వంగా ఊంజల్ సేవ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం సంప్రదాయ పర్వాల్లో భాగంగా ఆండాళ్‌దేవికి ఊంజల్ సేవోత్సవం నేత్రపర్వంగా చేపట్టారు. అమ్మవారిని బంగారు ఆభరణాలు, పట్టువస్త్రాలతో ప్రత్యేకంగా ముస్తాబు చేసి ఉత్తర దశలోని మండపంలో సేవను ఊరేగించారు.
విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవాలి
బీబీనగర్: విద్యార్థులు విషయ పరిజ్ణానం పెంపొందించుకోవాలని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సూచించారు. బీబీనగర్ మండలం గూడూరులోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఇంటిగ్రేటెడ్ లైబ్రరీని శుక్రవారం సందర్శించారు. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రయోగాలు, వర్చువల్ రియాల్టీ ప్రదర్శనలను తిలకించారు. విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథంతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సత్యనారాయణ, రాష్ట్ర విద్యా కమిషన్ సలహాదారులు వెంకట్‌రెడ్డి, గోనా రెడ్డి, ప్రీతిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు బాల్‌రెడ్డి, జీసీఎన్‌ఆర్ ట్రస్ట్ ప్రతినిధి అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో తారక్
భువనగిరి: పట్టణంలోని శ్రీ ఆర్‌కే ఆస్పత్రి అధి నేత డాక్టర్ రాజ్‌కుమార్, డాక్టర్ అశ్లేషల కుమారుడు చావా తారక్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన పోటీల్లో 196 దేశాల పేర్లు, వాటి రాజధానుల పేర్లను 4 నిమిషాల 20 సెకన్లలో చెప్పి ఈ ఘనత సాధించాడు. గతంలోనూ 100 దేశాలు, వాటి రాజధానుల పేర్ల చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేసుకున్నాడు. అతని సోదరి అకృతి కూడా 194 దేశాల పేర్లు తక్కువ వ్యవధిలో చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేసుకుంది. తారక్‌ను కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ అక్షాంశ్‌యాదవ్ శుక్రవారం కలెక్టరేట్‌లో అభినందించి మెడల్స్ అందజేశారు.

కొలిక్కిరాని చర్చలు

కొలిక్కిరాని చర్చలు

కొలిక్కిరాని చర్చలు