చక్కబెట్టేదంతా రైటర్లే! | - | Sakshi
Sakshi News home page

చక్కబెట్టేదంతా రైటర్లే!

Jul 19 2025 1:09 PM | Updated on Jul 19 2025 1:09 PM

చక్కబ

చక్కబెట్టేదంతా రైటర్లే!

రద్దు చేసినా కొనసాగుతున్న వ్యవస్థ

నిబంధనలు ఉల్లంఘించి.. రిజిస్ట్రేషన్లు చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఆస్తి విలువను బట్టి రూ.5వేల నుంచి రూ.లక్షల వరకు వసూలు చేస్తున్నారు. పత్రాల తయారీకయ్యే ఖర్చులతో పాటు రిజిస్ట్రేషన్‌కార్యాలయంలో ముట్టజెప్పాల్సిన సొమ్మును డాక్యుమెంట్‌ రైటర్లు, ప్రైవేట్‌ వ్యక్తులు తీసుకుంటున్నారు. డాక్యుమెంట్లు సక్రమంగా లేకపోవడం, సాక్షులు అందుబాటులో లేకపోతే సర్దుబాటు చేయడం, రిజిస్ట్రేషన్‌విలువ తగ్గించి చూపించేందుకు ముక్కు పిండి అదనంగా గుంజుతున్నారు. డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసినా కొనసాగుతూనే ఉంది.

దస్తావేజు లేఖర్ల కనుసన్నల్లోనే లావాదేవీలు

సహాయకులుగా ప్రైవేట్‌ వ్యక్తులు..

పైసలివ్వనిదే పని జరగదు

బీబీనగర్‌లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఘటనతో వెలుగులోకి

డాక్యుమెంట్‌ రైటర్లు, ప్రైవేట్‌ వ్యక్తులను పట్టుకున్న ఏసీబీ అధికారులు

సాక్షి,యాదాద్రి : సబ్‌ రిజిస్ట్రార్‌కార్యాలయాలు వసూళ్లకు నిలయాలుగా, అవినీతికి ఆనవాళ్లుగా మారాయి. పత్రాలన్నీ సక్రమంగా ఉన్నా.. ఎంతోకొంత ముట్టజెప్పనిదే పని కావడం లేదు. డాక్యుమెంట్‌రైటర్ల కనుసన్నల్లోనే లావాదేవీలన్నీ జరుగుతున్నాయి. అధికారుల వాటా కలుపుకుని డాక్యుమెంట్‌తయారీ ఖర్చుల కింద పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. బీబీనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఈనెల 17న ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించగా అక్రమాలు వెలుగుచూశాయి. లెక్కల్లో చూపని నగదు రూ.61,430, రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే సంబంధిత వ్యక్తులకు ఇవ్వాల్సిన 93 డాక్యుమెంట్లు సబ్‌రిజిస్ట్రార్ల వద్దనే ఉండటాన్ని గుర్తించారు.అంతేకాకుండా 12 మంది ప్రైవేట్‌ ఏజెంట్లు, డాక్యుమెంట్‌ రైటర్లను పట్టుకున్నారు. జిల్లాలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

ఇంచార్జ్‌లతో రిజిస్ట్రేషన్లు

రెగ్యులర్‌ సబ్‌రిజిస్ట్రార్‌లు లేకపోవడంతో ఇంచార్జ్‌లతో నెట్టుకొస్తున్నారు. దీంతో వారు ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆశతో ఇష్టారాజ్యంగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.దేవాదాయ, వక్ఫ్‌, శిఖం, బంచరాయి. పోరంబోకు, గ్రామ కంఠం, ఎల్‌ఆర్‌ఎస్‌ ప్లాట్లకు సంబంఽధించి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.

చౌటుప్పల్‌లో.. చౌటుప్పల్‌లో సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు ఒక సీనియర్‌ అసిస్టెంట్‌, నలుగురు జూనియర్‌ అసిస్టెంట్లు, షరాఫ్‌ ఒకరు, అటెండర్లు ఇద్దరు పని చేస్తున్నారు. మరో ప్రైవేట్‌ వ్యక్తి ఒకరు ఉన్నారు. సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం అమెరి కాలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి భూమిని తప్పుడు డాక్యుమెంట్లు, నకిలీ వ్యక్తులను సృష్టించి కోట్ల రూపాయల విలువైన భూమిని ఇతరులకు పట్టా చేయడంతో సబ్‌ రిజిస్ట్రార్‌ సస్పెండ్‌ అయ్యారు.

మోత్కూర్‌లో.. రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ అశోక్‌ను ఉన్నతాధికారులు ఎనిమిది నెలల క్రితం కుత్బుల్లాపూర్‌కు ఇంచార్జ్‌గా పంపారు. అప్పటినుంచి నల్లగొండలోని మార్కెట్‌ వాల్యూ ఆడిట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ అలివేలు మంగమ్మను ఇక్కడ ఇంచార్జ్‌గా నియమించారు. ఈమెతో పాటు ఇద్దరు జూనియర్‌ అసిస్టెంట్లు, ఒక షరాఫ్‌, అటెండర్‌ ఉన్నాడు. సీసీ కెమెరాలు పని చేస్తలేవు. నెట్‌ రాదని, సాంకేతిక సమస్యలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

రామన్నపేటలో.. రెగ్యులర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ హనుమంతరావు ఇబ్రహీంపట్నంకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఆయన స్థానంలో నల్లగొండకు చెందిన వరప్రసాదరావు డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. ఇక ముగ్గురు జూనియర్‌ అసిస్టెంట్లకు ఇద్దరు ఉన్నారు. ఒక పోస్టు ఖాళీగా ఉంది. ఇద్దరు అటెండర్లకు ఒక్కరే ఉన్నారు. సీసీ కెమెరాలు పనిచేయడం లేదు.

భువనగిరిలో.. భువనగిరి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌తో పాటు ఒక సీనియర్‌ అసిస్టెంట్‌, నలుగురు జూనియర్‌ అసిస్టెంట్లు, షరాఫ్‌ ఒకరు, అటెండర్లు ఇద్దరు ఉండాలి. ప్రస్తుతం సబ్‌ రిజిస్ట్రార్‌ పోస్టు ఖాళీగా ఉండటంతో సీనియర్‌ అసిస్టెంట్‌ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం ఒక సీనియర్‌ అసిస్టెంట్‌ అవకతవకలకు పాల్ప డటంతో అతనిపై సస్పెన్షన్‌ వేటు పడింది.

చక్కబెట్టేదంతా రైటర్లే! 1
1/1

చక్కబెట్టేదంతా రైటర్లే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement