
31 ఆస్పత్రులకు కాయకల్ప పురస్కారాలు
భువనగిరి: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు శుభ్రతకు ప్రాధాన్యమిచ్చిన 31 ఆస్పత్రులకు కాయకల్ప పురస్కారాలు దక్కాయి. వీటికి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రోత్సాహక నిధులు అందజేయనుంది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు రూ.2లక్షలు, పీహెచ్‌సీలకు రూ.1.50 లక్షలు, 85 నుంచి 92 శాతం నాణ్యత ప్రమాణాలు పాటించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు రూ.50వేల నుంచి లక్ష రూపాయలు, 80 శాతం నాణ్యత ప్రమాణాలు పాటించిన వాటికి రూ.25వేల నుంచి రూ.35వేల వరకు ఇస్తుంది. ఈ నిధులను వైద్య పరికరాల కొనుగోలు, వసతుల కల్పన, తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, ఉత్తమ సేవలందించిన సిబ్బందికి ప్రోత్సాహకం అందించడానికి వినియోగించనున్నారు.
ఫ ఏటా అందనున్న ప్రోత్సాహక నిధులు
ఫ మెరుగుపడనున్న వసతులు
ఎంపికై న ఆస్పత్రులు ఇవీ..
రామన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌తో పాటు కొండమడుగు, వేములకొండ, వలిగొండ, గుండాల, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట, బొల్లేపల్లి, భూదాన్‌పోచంపల్లి, అడ్డగూడూరు, వర్కట్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో అరూర్, పారుపల్లి, వీరవెల్లి, అనంతారం, బొందుగుల, జైకేసారం, చిన్నకొండూరు, కొయ్యలగూడెం, చౌళ్లరామారం, లింగోజిగూడెం, మాసాయిపేట, మర్యాల, సింగారం, కొరటికల్, కప్రాయిపల్లి, మైలారం, బొమ్మాపల్లి, కంచనపల్లి, పంతంగి, లక్కారం కేంద్రాలు కాయకల్ప పురస్కారాలకు ఎంపికయ్యాయి.