ఆహ్లాదం.. ఆనందం | - | Sakshi
Sakshi News home page

ఆహ్లాదం.. ఆనందం

Jul 21 2025 5:01 AM | Updated on Jul 21 2025 6:11 AM

యాదాద్రి భువనగిరి
ఇంటెలిజెన్స్‌దే భవిష్యత్‌
భవిష్యత్‌లో రోబోటిక్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ది అత్యంత ప్రాధాన్యం ఉంటుందని సంస్థ సీఈఓ తెలిపారు.

7

- 8లో

ఆదివారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2025

అర్హులందరినీ ఓటరు జాబితాలో చేర్చాలి

సాక్షి,యాదాద్రి : అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి అదనపు కలెక్టర్లు, ఇతర ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓటరు జాబితాలపై సమీక్షించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి మాట్లాడుతూ.. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు సంబంధించి ఫారం –6, 7,8 ఆక్షేపణలు పెండింగ్‌లో ఉన్నాయని, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నూతన ఓటరు నమోదుతో పాటు, మరణించిన ఓటర్ల పేర్లు తొలగించడం, ఫొటో, ఇంటి అడ్రస్‌ మార్పిడి తదితర వాటిని సవరించాలన్నారు. శిక్షణకు హాజరుకాని బూత్‌లెవల్‌ అధికారులకు ఈనెల 23న శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన

వలిగొండ: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణాలను శనివారం హౌసింగ్‌ పీడీ విజయ్‌ సింగ్‌ పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయించేందుకు అధికారులు కృషి చేయాలని, లబ్ధిదారులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులున్న వారికి స్వయం సహాయక సంఘాల నుంచి రుణాలు ఇప్పించాలని పేర్కొ న్నారు. ఆయన వెంట ఎంపీడీఓ జలందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు ఉన్నారు.

‘నేతన్న భరోసా’కు దరఖాస్తుల ఆహ్వానం

భువనగిరి: నేతన్న భరోసా పథకానికి చేనేత కార్మికుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు చేనేత, జౌళిశాఖ జిల్లా సహాయ సంచాలకులు శ్రీనివాస్‌రావు శనివారం ఒక ప్రటకనలో తెలిపారు. జియో ట్యాగింగ్‌ కలిగిన ప్రతి కార్మికుడు పథకానికి అర్హులన్నారు. పథకంలో నమోదు కావడానికి చేనేత కార్మికుడు, అనుబంధ కార్మికుడి పూర్తి వివరాలను పొందుపరిచిన ఫారం–ఎ, తెలంగాణ చేనేత లేబుల్‌ కోసం ఫారం–బిని అందజేయాలన్నారు. అధికారులు గ్రామాల్లో పర్యటించే క్రమంలో దరఖాస్తులను స్వీకరిస్తారని పేర్కొన్నారు. దరఖాస్తుఫారానికి ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా పాస్‌బుక్‌ జిరాక్స్‌ జత చేయాలన్నారు. ఈ నెల 22నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.

అర్హులందరికీ ఉపకరణాలు

భువనగిరి : అర్హులైన దివ్యాంగులందరికీ ఉపకరణాలు అందజేస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ భాస్కర్‌రావు అన్నారు. ఉపకరణాల కోసం ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను శనివారం ఆయన పరిశీలించారు. దరఖాస్తుల పరిశీలన పూర్తయినందున త్వరలోనే లబ్ధిదా రులను ఎంపిక చేసి ఉపకరణాలు పంపిణీ చేస్తామని చెప్పారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దివ్యాంగులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవా లని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మనోహర్‌, డీటీఓ సాయికృష్ణ, సూపరింటెండెంట్‌ శశికళ, సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

కనువిందు చేస్తున్న గ్రీనరీ

పార్కుల్లో రకరకాల మొక్కలు, గ్రీనరీ పెంచుతున్నారు. ఇవి ప్రజలకు ఆహ్లాదంతో పాటు నీడను, ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. పచ్చని వాతావరణంలో ప్రజలు సేదతీరుతూ ఆహ్లాదం పొందుతున్నారు. ఒకప్పుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా, పందులు, కుక్కలు, విష పురుగులు తిరిగిన ఖాళీస్థలాలు నేడు పచ్చని మొక్కలు, సందర్శకులు విశ్రాంతి తీసుకునే విధంగా రూపుదిద్దుకున్నాయి.

యాదగిరిగుట్ట: పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో పార్కులు రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే వైటీడీఏ ఏర్పాటు చేసిన పార్కులు పట్టణానికి పచ్చనిహారంలా మారగా.. అర్బన్‌ పార్కులు సైతం ప్రజలకు చక్కని ఆహ్లాదం పంచుతున్నాయి. వారాంతపు రోజులు, సెలవు దినాల్లో ఈ పార్కుల్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటు

టీయూఎప్‌ఐడీసీ నిధులు కోటి రూపాయలతో పార్కులను అభివృద్ధి చేశారు. సందర్శకులు సేదదీరేందుకు, ఉల్లాసంగా గడిపేందుకు అనువుగా వీటిని తీర్చిదిద్దారు. చిన్నారుల కోసం ఆట వస్తువులు ఉన్నాయి. ఉదయం, సాయంత్రం వేళలో వాకర్స్‌ పెద్దసంఖ్యలో పార్కులకు వస్తారు.వారికోసం వాకింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. వ్యాయామం చేసుకునేందుకు ఓపెన్‌ జిమ్‌లు ఉన్నాయి. ఇక్కడ యోగా సాధన కూడా చేస్తారు.

రింగ్‌ రోడ్డు చుట్టూ వాకింగ్‌ చేసేవాళ్లం

పార్క్‌ ఏర్పాటు చేయకముందు రింగ్‌ రోడ్డు చుట్టూ వాకింగ్‌ చేసేవాళ్లం. ఇప్పుడు పార్కు ఏర్పాటు చేయడంతో ఇక్కడికి వస్తున్నాం. సాయంత్రం సమయంలో రోజూ 100 పైగా వాకర్స్‌ వచ్చి వాకింగ్‌ చేస్తుంటారు. అంతేకాకుండా చిన్నారులు అడుకో వడానికి అవసరమైన పరికరాలు ఏర్పాటు చేశారు. పార్కులో ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఉదయం, సాయంత్రం వేళ సందర్శకులు పెద్ద సంఖ్యలో పార్కులకు వస్తున్నారు.

–బెలిదే ప్రమీళ, మార్కెట్‌ యార్డు ఏరియా

సేదదీరేందుకు అనువుగా ఉన్నాయి

11వ వార్డులో ఏర్పాటు చేసిన పార్కులో సేదదీరేందుకు అనువుగా ఉంది. రకరకాల మొక్కలు, చెట్లు, గ్రీనరీ ఉండటంతో ఉదయం, సాయంత్రం ప్రజలు వచ్చి సేదదీరుతున్నారు. వాకింగ్‌ ట్రాక్‌ ఉండటంతో వాకర్స్‌ వస్తున్నారు. జిమ్‌ పరికరాలు కూడా ఉండటం యువతకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

–తాళ్లపల్లి నాగరాజు, మాజీ కౌన్సిలర్‌, 11వ వార్డు

ప్రజలు తమ సమస్యలను పోలీస్‌ శాఖ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తాను. ఇక్కడి ప్రజలు సహృదయులు. అన్ని విధాలా పోలీస్‌ శాఖకు సహకరిస్తారు. పోలీస్‌ స్టేషన్‌లలో ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌లపై నిఘా పెట్టాం. సివిల్‌ మ్యాటర్‌లో జోక్యం చేసుకోవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చాం. జాతీయ రహదారిపై పెట్రోలింగ్‌ ముమ్మరం చేశాం. రోడ్డు యాక్సిడెంట్లను నిరోధించడం, డ్రగ్స్‌ నివారణకు అవగాహన చర్యలు చేపట్టడం, కార్డన్‌ సెర్చ్‌, నాకాబంది నిర్వహిస్తున్నాం. మహిళలపై జరుగుతున్న దాడుల కేసులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. సీసీ కెమెరాలు, కమ్యూనిటీ పోలీసింగ్‌, జీరో

ఎఫ్‌ఐఆర్‌ కేసుల నమోదుకు ప్రాధాన్యత ఇస్తున్నాం.

రెవెన్యూ డివిజన్‌

సాధించే వరకు పోరాటం

ఆలేరు: ఆలేరు రెవెన్యూ డివిజన్‌ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని, అన్ని వర్గాల ప్రజలు కలిసిరావాలని ఆలేరు అఖిలపక్ష కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఆలేరు పట్టణంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వారు మాట్లాడారు. నియోజకవర్గ కేంద్రమైన ఆలేరు ప్రాంతం దశాబ్దాలుగా వెనుకబాటుకు గురవుతుందని, దీనికంతటికీ పాలకుల నిర్లక్ష్యమే కారణమని దుయ్యబట్టారు. రెవెన్యూ డివిజన్‌ చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. రెవెన్యూ డివిజన్‌ సాధనకోసం దశలవారీగా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని కొనసాగిద్దామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈనెల 22న ఆలేరులో బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు అన్నివర్గాల ప్రజలు మద్ధతు ఇవ్వాలని కోరారు. సమావేశంలో అఖిలపక్ష కమిటీ కన్వీనర్‌ పసుపునూరి వీరేశం, సాధన సమితి నాయకులు మొరిగాడి చంద్రశేఖర్‌, ఆర్‌.జనార్థన్‌, పుట్ట మల్లేష్‌,ఎండీ సలీం,పూల నాగయ్య తోపాటు వివిధ పార్టీల నాయకులు,వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

యూత్‌ గోల్‌ ఇదే..

యువత లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ లక్ష్యాలను చేరుకునేందుకు నిరంతరం శ్రమిస్తే తప్పక విజయం లభిస్తుంది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. సమాజంలో ఉత్తమ సిటిజన్‌గా ఎదగాలి. ఆడపిల్లలను గౌరవించాలి. మెరుగైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.

అక్క,తమ్ముడు అదుర్స్‌

ప్రపంచ దేశాలు, వాటి రాజధానుల పేర్లు తక్కువ సమయంలో చెప్పి అదుర్స్‌ అనిపించారు అక్క, తమ్ముడు.

- 8లో

న్యూస్‌రీల్‌

ఇక్కడి ప్రజలు

సహృదయులు

పచ్చదనంతో కళకళలాడుతున్న మున్సిపల్‌ పార్కులు

ఫ పలు రకాల మొక్కల పెంపకం

ఫ వాకింగ్‌ ట్రాక్‌, జిమ్‌ పరికరాలు ఏర్పాటు

ఫ పిల్లల కోసం ఆట వస్తువులు

ఆహ్లాదం.. ఆనందం 1
1/12

ఆహ్లాదం.. ఆనందం

ఆహ్లాదం.. ఆనందం 2
2/12

ఆహ్లాదం.. ఆనందం

ఆహ్లాదం.. ఆనందం 3
3/12

ఆహ్లాదం.. ఆనందం

ఆహ్లాదం.. ఆనందం 4
4/12

ఆహ్లాదం.. ఆనందం

ఆహ్లాదం.. ఆనందం 5
5/12

ఆహ్లాదం.. ఆనందం

ఆహ్లాదం.. ఆనందం 6
6/12

ఆహ్లాదం.. ఆనందం

ఆహ్లాదం.. ఆనందం 7
7/12

ఆహ్లాదం.. ఆనందం

ఆహ్లాదం.. ఆనందం 8
8/12

ఆహ్లాదం.. ఆనందం

ఆహ్లాదం.. ఆనందం 9
9/12

ఆహ్లాదం.. ఆనందం

ఆహ్లాదం.. ఆనందం 10
10/12

ఆహ్లాదం.. ఆనందం

ఆహ్లాదం.. ఆనందం 11
11/12

ఆహ్లాదం.. ఆనందం

ఆహ్లాదం.. ఆనందం 12
12/12

ఆహ్లాదం.. ఆనందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement