
ఆండాళ్‌దేవికి సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సంప్రదాయ పర్వాల్లో భాగంగా శుక్రవారం ఆండాళ్‌దేవిక ఊంజల్‌సేవ ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహించారు. సాయంత్రం ఆండాళ్‌దేవిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవ చేపట్టారు. ఇక ప్రధానాలయంలో నిత్యారాధనలు యథావిధిగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, అర్చన, ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ తదితర కై ంకర్యాలు గావించారు.