
కనువిందు చేసేలా శంకు,చక్ర నామాలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి శంకు, చక్ర నామాలను దూరం నుంచి వచ్చే భక్తులకు కూడా కనిపించేలా ఏర్పాటు చేయాలని ఈఓ వెంకట్రావ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన తన చాంబర్‌లో దేవస్థానం అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేశారు. ప్రస్తుతం మెట్లమార్గంలోని బొర్రబండపై ఉన్న శంకు, చక్ర నామాలను పెయింటింగ్‌తో తీర్చిదిద్దాలన్నారు. అంతేకాకుండా ప్రసాద విక్రయశాలపై భాగంలోనూ శంకు, చక్ర నామాలు ఏర్పాటు చేసి భక్తులకు కనువిందు చేసేలా విద్యుత్ లైట్లు అమర్చాలని కోరారు. సమావేశంలో అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కాండూరి వెంకటచార్యులు, డిప్యూటీ ఈఓ భాస్కర్‌శర్మ, అధికారులు దయాకర్‌రెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు.