
ఆదర్శప్రాయుడు దొడ్డా నారాయణరావు
కమ్యూనిస్టు యోధుడు దొడ్డా నారాయణరావు ఆదర్శప్రాయుడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అన్నారు. శనివారం దొడ్డా నారాయణరావు అంతిమ యాత్రలో ఆయన పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్బంగా నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలకప్రాత పోషించిన మహోన్నత వ్యక్తి దొడ్డా నారాయణరావు అని అన్నారు. ప్రతిఒక్కరూ నారాయణరావును ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధనకు కృషిచేయాలని అన్నారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. నారాయణరావు మృతి సీపీఐకి తీరని లోటని అన్నారు. ఉమ్మడి జిల్లాలో దొడ్డా నారాయణరావుకు చెరగని ముద్ర వేశారని కొనియాడారు.
అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రముఖులు..
దొడ్డా నారాయణరావు అంతిమ యాత్రలో కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతిరెడ్డి పాల్గొని ఆయన మృతదేహం వద్ద నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్‌రావు, బొల్లం మల్లయ్యయాదవ్, ఉజ్జిని యాదగిరిరావు, జూలకంటి రంగారెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు పశ్య పద్మ, వనజ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, బొమ్మగాని ప్రభాకర్, సూర్యాపేట, భువనగిరి జిల్లాల సీపీఐ కార్యదర్శులు బెజవాడ వెంకటేశ్వర్లు, శ్రీరాములు, సీపీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు ఉజ్జిని రత్తాకర్, పల్లా నరసింహారెడ్డి, ఉస్తెల సృజన, కేవీఎల్, కొండా కోటయ్య, చేపూరి కొండలు, సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి మల్లెల ఆదిరెడ్డి తదితరులు దొడ్డా నారాయణరావు భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలతో నివాళులర్పించారు.

ఆదర్శప్రాయుడు దొడ్డా నారాయణరావు