
యాదగిరిగుట్టకు తరలివచ్చిన భక్తులు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. రెండో శనివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారు. ఆలయ పరిసరాలు, ముఖ మండపం క్యూలైన్, క్యూకాంప్లెక్స్, ప్రసాద విక్రయశాల ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు. స్వామివారి ధర్మ దర్శనానికి రెండున్నర గంటల సమయం, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు. వివిధ పూజలతో స్వామివారికి నిత్యాదాయం రూ.31,99,413 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.