
గంజాయి విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్
ఫ 4కిలోల గంజాయి స్వాధీనం
సూర్యాపేటటౌన్: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం చెరువు అన్నారం గ్రామానికి చెందిన గండమల్ల దుర్గాప్రసాద్, సూర్యాపేట పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన చెరుకు దీపక్ ఐదు రోజుల క్రితం బైక్‌పై ఏపీలోని సీలేరు ప్రాంతానికి వెళ్లి అక్కడ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి కిలో రూ.3వేల చొప్పున నాలుగు కిలోలు గంజాయి కొనుగోలు చేసి సూర్యాపేటకు తీసుకొచ్చి పట్టణంలోని దుర్గాప్రసాద్ రూంలో దాచిపెట్టారు. శుక్రవారం వారిద్దరితో పాటు పట్టణంలోని చర్చి కాంపౌండ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ జానీపాషా కలిసి గంజాయి పంచుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో దుర్గాప్రసాద్ రూం వద్దకు జానీపాషా వచ్చాడు. వారిద్దరు గంజాయి పంచుకుంటుండగా.. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. చెరుకు దీపక్‌ను తన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. నిందితుల నాలుగు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఫ అరుణాచలంలో హత్యకు గరైన
విద్యాసాగర్ తండ్రి ఆవేదన

గంజాయి విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్