
డేటా ఎంట్రీ డబ్బులేవీ..?
భువనగిరిటౌన్ : ప్రజాపాలన దరఖాస్తులు ఆన్‌లైన్ చేసిన ఆపరేటర్లకు ఎంట్రీ చార్జీల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. డేటా ఎంట్రీ ముగిసి ఆరు నెలలు గడుస్తున్నా నిధులు విడుదల చేయకపోవడంతో ఆపరేటర్లకు ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం కింద ఆరు గ్యారంటీల అమలుకు ప్రజలనుంచి దరఖాస్తులు స్వీకరించింది.మున్సిపాలిటీల్లో 46,441, గ్రామ పంచాయతీల్లో 2,13,431 దరఖాస్తులు వచ్చాయి. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పాటు ప్రైవేట్ వ్యక్తులు డేటా ఎంట్రీలో పాల్గొన్నారు. జనవరి 8నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు ఆన్‌లైన్ నమోదు కొనసాగింది.
మున్సిపాలిటీల్లో 46,441 దరఖాస్తులు
జిల్లాలో ఆరు మున్సిపాలిటీలు ఉండగా 46,441 దరఖాస్తులు వచ్చాయి. 382 మంది డేటీ ఎంట్రీలో పాల్గొన్నారు. ఒక్క దరఖాస్తుకు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి రూ.7, ప్రైవేట్ ఆపరేటర్లకు రూ.15 చొప్పున చెల్లించాల్సి ఉంది. సుమారు రూ.7 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది.
గ్రామ పంచాయతీల్లో..
గ్రామ పంచాయతీల్లో 2,13,431 దరఖాస్తులు వచ్చాయి. మండల పరిషత్ కార్యాలయాల్లో క్యాంపులు నిర్వహించి డేటీ ఎంట్రీ చేయించారు. 1,500 మంది ఆపరేటర్లకు రూ.21,34,310 రావాల్సి ఉంది. ఇప్పటి వరకు డబ్బులు రాకపోవడంతో ఆపరేటర్లు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ఫ ప్రజాపాలన దరఖాస్తులు ఆన్‌లైన్ చేసిన అపరేటర్లు
ఫ జనవరి 18న ముగిసిన ఎంట్రీ
ఫ రూ.28 లక్షలకు పైనే బకాయి
ఫ ఆరు నెలలుగా ఎదురుచూపుల్లోనే..