
కిలోమీటరు దూరం నడిచి వెళ్లేవాళ్లం
మాది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం దిలావర్పూర్ పంచాయతీ పరిధిలోని సుభాన్‌పూర్. మా గ్రామంలో స్కూల్ లేకపోవడంతో కిలోమీటరు దూరంలో ఉన్న దిలావర్పూర్కు కాలినడకన వెళ్లేది.మొదట్లో మాతాత స్కూల్‌కు తీసుకెళ్లి వదిలివచ్చేది. ఆ తరువాత ఉదయం, సాయంత్రం స్నేహితులతో కలిసి వెళ్లేది. వేసవి సెలవులు ఎప్పుడు ముగుస్తాయా, స్కూల్ ఎప్పుడు తెరుస్తారా.. అని ఆతృత ఉండేది. పాఠశాలకు సంతోషంగా వెళ్లేవాడిని. బాల్యంనాటి జ్ఞాపకాలు ఇంకా గుర్తుకొస్తుంటాయి.
–శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్, భూదాన్‌పోచంపల్లి