విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
నిడమనూరు : విద్యుత్ తీగలు లాగుతుండగా ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం నిడమనూ రు మండలంలోని ముప్పా రం సబ్‌స్టేషన్ సమీప ంలో చోటుచేసుకుంది. ముప్పారం సబ్‌స్టేషన్‌కు అర కిలోమీటరు దూరంలో విద్యుత్ లైన్ల ఏర్పాటుకు కాంట్రాక్టర్ సతీష్ కూలీలతో పనులు చేయించేందుకు లైన్‌మన్ పోలె పాపయ్య ద్వారా ముప్పారం సబ్‌స్టేషన్ ద్వారా విద్యుత్ సరఫరా నిలిపివేసేందుకు లైన్ కట్ (ఎల్‌సీ) తీసుకున్నారు. విధుల్లో ఉన్న సబ్ స్టేషన్ ఆపరేటర్ అమ్జద్ ఖాన్ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయితే పనులు పూర్తకాక ముందే తిరిగి లైనమన్ ఆదేశాలతో విద్యుత్ సరఫరా పునరుద్ధరించడంతో పనులు చేస్తున్న త్రిపురారం మండలం అంజనపల్లి గ్రామానికి చెందిన కుర్రి నందు(20) విద్యుదాఘాతంలో అక్కడికక్కడే మృతి చెందాడు.
సబ్‌స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన
ముప్పారం సబ్‌స్టేషన్ ఎదుట నందు మృతదేహంతో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. తుమ్మడం గ్రామానికి చెందిన సతీష్ వద్ద ఏడాదిగా గ్రామంలోని పలువురు మిత్రులతో కలిసి నందు విద్యుత్ పనులు చేస్తున్నాడని పేర్కొన్నారు. విద్యుత్ తీగలు లాగుతున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడని పేర్కొన్నారు. నందుపైనే తమ కుటుంబం ఆధారపడి ఉందని, అతడి తండ్రి శ్రీను అనారోగ్యంతో ఉన్నాడని, తల్లి పార్వతమ్మ గ్రామంలో కూలీ పనులకు వెళ్తుందని బంధువులు తెలిపారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆందోళనకు దిగారు. నిడమనూరు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఫ విద్యుత్ తీగలు లాగుతుండగా ఘటన
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి


