ఇక్కత్ కళా నైపుణ్యం భేష్
భూదాన్‌పోచంపల్లి: ఇక్కత్ కళా నైఫుణ్యాలు భేషుగ్గా ఉన్నాయని ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైనింగ్ విద్యార్థుల బృందం కొనియాడారు. హైదరాబాద్‌లోని రూట్స్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ కళాశాలకు చెందిన 30 మంది విద్యార్థులు బుధవారం భూదాన్‌పోచంపల్లిలో పర్యటించారు. చేనేత గృహాలు, స్థానిక రూరల్ టూరిజం పార్కును సందర్శించారు. నూలు, రంగుల అద్దకం, చిటికి కట్టడం, టైఅండ్‌డై విధానం, మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలను పరిశీలించారు. ఇక్కత్ డిజైన్లను చూసి చేనేత కళాకారుల నైపుణ్యాలను కొనియాడారు. కాలేజీ ఫ్యాకల్టీ మోహనశ్రీ మాట్లాడుతూ.. స్టడీ టూర్‌లో భాగంగా ఇక్కత్‌కు ప్రసిద్ధి చెందిన పోచంపల్లికి వచ్చినట్లు చెప్పారు. నేటి ఫ్యాషన్ రంగానికి, ఇంటీరియర్‌కు పోచంపల్లి ఇక్కత్‌వస్త్రాలు ఎంతో అనువుగా ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ హబీబీ పడాల, ఫ్యాకల్టీ కావ్య, ఉష, అంకిత, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫ పోచంపల్లిని సందర్శించిన
ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు


