
ఈదురుగాలులు, వడగండ్లు
భువనగిరిటౌన్, భూదాన్‌పోచంపల్లి, యాదగిరిగుట్ట రూరల్: భువనగిరి, భూదాన్‌పోచంపల్లి, యాదగిరి గుట్ట మండలాల్లో శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి భువనగిరి పట్టణంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈదురుగాలులకు ఫ్లెక్సీలు కూలిపోయాయి. ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయి సామగ్రి తడవడంతో బాధిత కుటుంబాలు ఇబ్బంది పడ్డారు. జిల్లా కోర్టు ఆవరణలో ప్రహరీ కూలింది. చెట్లు విరిగిపడటంతో కారు ధ్వంసమైంది. కిసాన్‌నగర్‌లో విద్యుత్ స్తంభం కూలిపోయింది. మామిడి కాయలు నేలరాలాయి.
పోచంపల్లిలో అంధకారం
ఈదురుగాలుల వల్ల కరెంట్ సరఫరా నిలిచిపోయి పోచంపల్లి అంధకారంగా మారింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు నానా అవస్థలు పడ్డారు. యాదగిరిగుట్ట మండలం గౌరా యపల్లిలో పాడి గేదె పిడుగుపాటుకు మృతి చెందింది. అత్యధికంగా భువనగిరి 25, యాదగిరిగుట్టలో 23.3, బీబీనగర్‌లో 14 మి.మీ వర్షం కురిసింది.
ఫ భువనగిరి కోర్టు ఆవరణలో కూలిన చెట్లు
ఫ మామిడి తోటల్లో రాలిన కాయలు
ఫ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

ఈదురుగాలులు, వడగండ్లు

ఈదురుగాలులు, వడగండ్లు

ఈదురుగాలులు, వడగండ్లు