తాడేపల్లిగూడెం: ఎల్‌నినో తీవ్రత నివారణ కోసం ప్రణాళిక తయారుచేసినట్టు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ కె.ధనుంజయరావు తెలిపారు. ఎల్‌నినో పరిస్థితులపై గురువారం జరిగిన వర్చువల్ సమావేశంలో వెంకట్రామన్నగూడెం నుంచి వీసీ పాల్గొన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో వ్య వసాయం, ఉద్యాన పంటలకు తలెత్తే నష్టాన్ని నివారించేందుకు ప్రణాళిక తయారు చేసిందని వీసీ చెప్పారు. ఇప్పటివరకు కూరగాయలు పండించని ప్రాంతంలో కూరగాయల సాగును ప్రోత్సహించాలన్నారు. ఇంటింటా కూరగాయల సాగును ప్రోత్సహించడానికి విత్తనాల కిట్లు ప్రభుత్వ సాయంతో అందించాలన్నారు. కిచెన్ గార్డెన్ కిట్లను అందించాలన్నారు. ఉల్లి, టమాటా, ఆయిల్‌పామ్ ఉత్పత్తి పెంపు, పప్పు ధాన్యాల ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచడానికి వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. పండ్ల తోటల్లో డ్రిప్ ఇరిగేషన్‌ను అమ లు చేయాలని, మల్చింగ్, వీడ్ మ్యాట్స్ రక్షణ ను ప్రోత్సహించాలన్నారు. ప్రకృతి ఉద్యాన వ్య వసాయ పద్ధతులను క్షేత్రస్థాయిలో రైతులకు చేరాలని రైతు సాధికారక సంస్థ వైస్ చైర్మన్ టి.విజయకుమార్ కోరారు. వర్సిటీ విస్తరణ సంచాలకులు సీహెచ్ రూత్, పరిశోధనా సంచాలకులు ఎస్.సూర్యకుమారి పాల్గొన్నారు.
తణుకు అర్బన్: అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 20న తణుకు చిట్టూరి ఇంద్ర య్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించనున్నట్టు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సంకు సూర్యనారాయణ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి అండర్ 14,16,18,20 బాలురు, బాలికల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. ఎంపికై న క్రీడాకారులను వచ్చేనెల 2 నుంచి 4 వరకు కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని చెప్పారు. మరిన్ని వివరాలకు 9989363978, 9676251733 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
తాడేపల్లిగూడెం: క్రిబ్‌కో కంపెనీ నుంచి తాడేపల్లిగూడెంలోని ర్యాక్ పాయింటుకు గురు వారం 350 టన్నుల యూరియా వచ్చింది. ప్రై వేటు డీలర్లకు వంద టన్నులు, ఏపీ మార్క్‌ఫెడ్‌కు 250 టన్నులు పంపించినట్టు ర్యాక్ ఆఫీసర్ నారాయణరావు తెలిపారు. రాబోయే రబీ సీజన్‌లో అవసరాన్ని బట్టి ఈ యూరియాను వినియోగిస్తామన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): పీపీపీ విధానంలో ప్రైవేట్ ఎంఎస్‌ఎంఈ పార్కులకు ప్రోత్సాహం అందించి నూతన పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం, పె ట్టుబడిదారులతో ముఖాముఖీ నిర్వహించారు.
అర్జీదారులతో నేరుగా మాట్లాడాలి
పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో అర్జీదారులు పూర్తి సంతృప్తి చెందేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి పీజీఆర్‌ఎస్‌పై ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులతో అధికారులు స్వయంగా మాట్లాడి వారి సమస్యను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు.
భీమవరం: నాణ్యతా ప్రమాణాల పరిశీలనతోనే వినియోగదారులకు రక్షణ కలుగుతుందని బీఐఎస్ డిప్యూటీ డైరెక్టర్ వివేక్‌వర్ధన్ రెడ్డి, స్టాండర్డ్స్ ప్రమోషన్ ఆఫీసర్ డి.కృష్ణవీర్‌వర్మ అన్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్), వలంటరీ కన్స్యూమర్ అసిస్టెన్స్ నె ట్‌వర్క్ (వీక్యాన్) సంయుక్త ఆధ్వర్యంలో గురువారం స్థానిక వీక్యాన్ కార్యాలయంలో వినియోగదారుల అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు మాట్లాడు తూ వినియోగదారుల హక్కులు, భద్రతా ప్రమాణాలపై దిశానిర్దేశం చేశారు. ఐఎస్‌ఐ మార్క్, సీఆర్‌ఎస్, హాల్‌మార్క్ గుర్తుల ప్రాధాన్యతను వివరించారు. బీఐఎస్ కేర్ యాప్ ద్వారా నాణ్యమైన ఉత్పత్తులనే ఎంపిక చేసుకోవాలని సూచించారు. వీక్యాన్ అధ్యక్షుడు, న్యాయవాది సన్నీరాజ్ బొమ్మిడి మాట్లాడారు.


