భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం కలెక్టరేట్‌లో గురువారం విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆ యన చిత్రాపటానికి కలెక్టర్ సీహెచ్ నాగరాణి పూ లమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వకర్మ వృత్తిదారులు, శిల్పకారులు, చేతివృత్తిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. విరాట్ విశ్వకర్మను సృష్టి, ని ర్మాణ నైపుణ్యానికి ప్రతీకగా భావిస్తారని, భారతీయ సంస్కృతిలో శిల్పకళ, చేతివృత్తులు, నిర్మాణ రంగానికి విశిష్ట స్థానం ఉందని అన్నారు. సమాజ అభివృద్ధికి, ఆర్థిక పురోగతికి విశ్వకర్మ వృత్తిదారులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అనంతరం జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. డీఆర్వో పి.గ్లోరియా, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఏవీ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.


