యాప్‌ చాలా ఉపయోగం | - | Sakshi
Sakshi News home page

యాప్‌ చాలా ఉపయోగం

Apr 28 2026 8:46 AM | Updated on Apr 28 2026 8:46 AM

యాప్‌ చాలా ఉపయోగం గ్రూప్‌– 2 పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్నా సద్వినియోగం చేసుకోవాలి

నేను పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నాను. నాకు నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ యాప్‌ చాలా ఉపయోగపడుతుంది. దీనిలో 40 లక్షల వరకు పుస్తకాలు వివిధ భాషలలో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేకుండా కంప్యూటర్లు కూడా ఉపయోగించడం నిరుద్యోగులకు వరం. – టి ధనుంజయ, యండగండి

నేను గ్రూప్‌– 2 పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్నా. నాకు అవసరమైన అకాడమీ పుస్తకాలు నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ యాప్‌లో రిఫర్‌ చేస్తున్నాను. యాప్‌ ఉచితంగా ఉపయోగించుకోవడం వల్ల ప్రీవియస్‌ పేపర్లు ప్రాక్టీస్‌ చేసుకునే అవకాశం కూడా కలిగింది. ప్రధానంగా సీఆర్‌టి పుస్తకాలు చాలా ఉపయోగపడుతున్నాయి. – బి.ఉమశ్రీ, భీమవరం

వైఎస్సార్‌ శాఖా గ్రంథాలయంలో ఉచిత డిజిటల్‌ లైబ్రరీ సేవలు అందుబాటులో ఉన్నాయి. వివిధ భాషల్లో 40 లక్షల పుస్తకాలు చదువుకునే అవకాశముంది. దాతల సహకారంతో కంప్యూటర్లు ఏర్పాటుచేశాం. ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలి.

– ఎస్‌.వెంకటేశ్వరరావు, లైబ్రరీయన్‌, భీమవరం

Advertisement
 
Advertisement
Advertisement