పాలకొల్లు సెంట్రల్ : పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం త్రిశూలస్నానం, కంకణ విమోచన అవభృద స్నానం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాత్రి స్వామివార్ల పుష్పోత్సవ కార్యక్రమం చేశారు. దాదాపు 25 మంది దంపుతులు అమ్మవారికి బుట్టల్లో సారెను సమర్పించారు. అనంతరం ముత్తయిదువులకు జాకెట్టు, గాజులు పంపిణీ చేశారు. దాతలు కంచర్ల రామారావు కుమారులు సత్యనారాయణ, సూర్యనారాయణ దంపతులు ప్రసాద వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ వాసు తదితరులు పాల్గొన్నారు.


